Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్: పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే ప్రకాశం, గుంటూరు (GNT), ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.మరోవైపు తెలంగాణలోనూ వర్షాల తీవ్రత కొనసాగనుంది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది.



